పుట:2015.370800.Shatakasanputamu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

భక్తిరసశతకసంపుటము


తుల పయిఁ గాఁపుగా నిడినతొయ్యలిఁ ద...

28


ఉ.

కారము నూరిపోయునెడ గాసిలనీయదు బోరుబెట్టినన్
గూరిమితోడ నెత్తుకొని గుబ్బల పా లిడు జోలఁ బాడు స
త్కారము మీఱుచోఁ గసురు దాఁకె నటం చని కుందుఁ బుత్త్రలీ
లారతి నాఁటనాఁట నిటుల న్మదిఁ ద....

29


చ.

తనపొరుగిండ్లభామినులు తారసిలంగను దృష్టి తాఁకునో
యని మిహిరాదిక,గ్రహచయాభిమతు ల్పచరించి మీనలో
చనను దలంచి నందనునిసంగతిఁ బాయక ప్రోవవమ్మ యో
జననియటంచు నంజలులు సల్పెడు తల్లినిఁ బోల రెవ్వరున్.

30


చ.

పెనఁకువమీఱునంతఁ దనబిడ్డపయిం గలయట్టిబాళిచే
తను మలమూత్రము ల్గడుముదంబున నెమ్మెయిఁ బూసినట్టి చం
దనహిమనీరసౌరభము దారిఁ దలంచు నిజాన్వయాబ్ధిచం
ద్రునిఁ గనినట్లు బొంగు భళిరే యల త...

31


చ.

అనుదిన మాత్మసంభవున కాముద ముగ్గిడు నంతమీఁద లో
చనములు ముక్కు పెందొడలు చంకలు కాళ్లును చేతు లాదిగాఁ