పుట:2015.370800.Shatakasanputamu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

అప్పావు మొదలి విరచిత

మాతృశతకము

ఉ.

శ్రీపతియైనఁ గాని విధుశేఖరుఁడైన త్రిశూలపాణియై
నా పరమేష్ఠియైన గణనాయకుఁడైన రమామృడాన లై
నా పలుకుం బొలంతి యయి నా పరిరక్షణకార్యసత్క్రియో
ద్దీపనబోధనోక్తులను దెల్పడు తల్లినిఁ బోల రెవ్వరున్.

1


చ.

జలరుహనేత్రుడైన యల చక్కనిదేవుని బొడ్డుతమ్మీలో
పలను జనించి వాగ్వనితపాలిటి పెన్నిధియో యనంగఁ బెం
పలరిన బ్రహసృష్టికిని నాదిమకారణమై త్రయీమయో
క్తులఁ గొనియాడి నాద్యయగుతొయ్యలిఁ ద...

2


చ.

చిఱుతతనంబునన్ జెలులఁ జేరి విహారము సల్పువేళ నా
దరమునఁ గొయ్యబొమ్మను ముదంబునఁ బుత్త్రునిగాఁ దలంచి తాఁ
బరవశ మొంది వేడుక నెపం బిడి లాలనఁ జేసి మిక్కిలిన్
మురివముఁ గాంచి మోహమున నూల్కొనుత......

3