పుట:2015.370800.Shatakasanputamu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచింపఁబడినటులఁ బూర్వముద్రణమువలనఁ దెలియుచున్నది. అంతియగాక కని తననామము అప్పావు అని నూఱవపద్యములోఁ జెప్పి కొనినాఁడు. ఈశతకములోఁ బలుతావుల మీనాక్షిస్మరణము (చూ.ప. 14, 30, 70, 86, 93) చేసియుంటవలనను, మాతృశతకము పూర్వముద్రణము గావించిన కవికుమారుని నామము మీనాక్షి దాసు ఐయుంటవలనను కవి మీనాక్షి భక్తుఁడనియు మధురామండలనివాసి యనియు నూహచేయ నవకాశము చిక్కుచున్నది. శతకమునుండి కవిచరిత్ర మింత కెక్కుడు తెలియరాదు.

ఈతకరచయితయగు అప్పావు మొదలారి ద్రవిడదేశము చేరిన యాంధ్రుఁడని కవితను బట్టి యూహ చేయవచ్చును. ఈశతకము ప్రథమముద్రణము కవి కుమారుడు క్రీ. శ. 1861 లో నొనర్చియుంటవలన నీది యిప్పటికి రమారమి డెబ్బది సంవత్సరములనాఁడు రచింపఁబడినటులఁ దోఁచుచున్నది. ఉపజ్ఞాకల్పితమగు నిట్టియుత్తమశతకమును పునర్ముద్రణ మొనర్చి యాంధ్రలోకమున కొసంగిన బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారి యుద్యమము ప్రశంసాపాత్రము. కవితలో నటనట వ్యాకరణదోషములు గానవచ్చుచున్నవి.