పుట:2015.370800.Shatakasanputamu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

తెలుఁగుబాసలోఁ బేరెన్నికఁగన్న శతకములలో మాతృశతక మొకటిగా నెన్నఁదగియున్నది. ఇందు గర్భధారణమునకు ముందునుండి పుత్త్రవాంఛతో సతు లువ్వెళులూరువిధము గర్భభారముచేఁ గృశించుచు సత్పుత్త్రునికై జననిపొందునాందోళనము కుమారుని శ్రేయావృద్ధులకు విద్యావిశేషాదులకుఁ దల్లి యానందించువిధము రమణీయముగ, మనోహరముగ, స్వభావానుకూలముగ రసవత్తరముగ వర్ణింపఁబడినది. తనకుమారుడు విద్యావివేకశాలియై రాజకీయకార్యములతోఁ బేరెన్నికఁ గనినంత తల్లి భారము తీఱదని కాబోలు, ఈ కవికొడుకు కోడలు కలిసి మెలసియుండునపుడు మనుమడు కలిగినపుడు మాతృదేవి పొందు సంతోషపారవశ్యము లీ గ్రంథమున సజీవముగఁ జిత్రించియున్నాఁడు.

మాతృలీలలను, శతకకర్తయగు నీకవి చక్కఁగ హృదయగతము గావించుకొని భక్తిరసావృతమగు నిరర్గళకవితతో “మాతృదేవోభవ" యను వేదవాణిని ముక్తకంఠముతో గానము గావించి మాతౄణముక్తుఁ డయ్యెను. ఆంధ్రవాఙ్మయమునఁగల శతకసమూహమునం దిట్టి ప్రేమస్వరూప మనఁదగు మాతృదేవతను స్మరించు గ్రంథములు చాలయరుదుగానున్నవి, ఈశతకము మాతూరి అప్పారావు మొదలారిచే