Jump to content

పుట:2015.370800.Shatakasanputamu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. తిరుమణి దురితవిదూరము
     తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్‌
     తిరుమణిఁ బెట్టిన మనుజుఁడు
     పరమపవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణా!93
క. శ్రీలక్ష్మీనారాయణ
     వాలాయము నిన్నుఁ దలఁతు వందితచరణా
     ఏలుము నను నీ బంటుగఁ
     జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా!94
క. శ్రీధర మాధవ యచ్యుత
     భూధర పురుహూతవినుత పురుషోత్తమ నీ
     పాదయుగళంబు నెప్పుడు
     మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా!95
క. శిరమున రత్నకిరీటము
     కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్‌
     ఉరమున వజ్రపుఁబతకము
     సిరినాయక యమరవినుత శ్రీహరి కృష్ణా!96
క. అందెలు పాదములందును
     సుందరముగ నుంచినావు సొంపలరంగా
     మందరధర మునిసన్నుత
     నందుని వరపుత్ర నిన్ను నమ్మితిఁ గృష్ణా!97
క. కందర్పకోటి సుందర
     మందరధర భానుతేజ మంజులదేహా