ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగఁ గృష్ణా!87
క. అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్
జయ్యన గలఁగుచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగఁ గృష్ణా!88
క. కంటికి ఱెప్ప విధంబున
బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటక మగు పాపములను గడచితిఁ గృష్ణా!89
క. యమునకు నిఁక నే వెఱువను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమఁరఁగఁ దలఁచెదను వేగ ననిశము కృష్ణా!90
క. దండమయా విశ్వంభర
దండమయా పుండరీక దళనేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా!91
క. నారాయణ లక్ష్మీపతి
నారాయణ వాసుదేవ నందకుమారా
నారాయణ నిను నమ్మితి
నారాయణ నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా!92