పుట:2015.370800.Shatakasanputamu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     విశదముగఁ గీర్తి నేలిన
     దశరథరామావతార ధన్యుఁడ కృష్ణా!43
క. ఘనులగు ధేనుకముష్టిక
     దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిన్‌
     అనఘాత్మ రేవతీపతి
     యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా!44
క. త్రిపురాది దైత్యభార్యల
     నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్‌
     కృపగలరాజవు బళిరే
     కపటపుబుద్ధావతార ఘనుఁడవు కృష్ణా!45
క. బలుపుగల తేజి నెక్కియు
     నిలపై ధర్మంబు నిలుప హీనులఁ ద్రుంపన్‌
     కలియుగము తుదను వేడుక
     కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా!46
క. వనజాక్ష భక్తవత్సల
     ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
     కన నీ సద్గుణజాలము
     సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా!47
క. అపరాధ సహస్రంబుల
     నపరిమితములైన యఘము లనిశము నేనున్‌
     గపటాత్ముఁడనై చేసితిఁ
     జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా!48