పుట:2015.370800.Shatakasanputamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. పదునాలుగు భువనంబులు
     కుదురుగ నీకుక్షి నిల్పుకొను నేర్పరివై
     విదితంబుగ నాదేవకి
     యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా!11
క. అష్టమి రోహిణి ప్రొద్దున
     నష్టమగర్భమునఁ బుట్టి యాదేవకికిన్‌
     దుష్టునిఁ గంసు వధింపవె
     సృష్టి ప్రతిపాలనంబు సేయఁగఁ గృష్ణా!12
క. అల్ల జగన్నాథుకు వ్రే
     పల్లియ క్రీడార్థ మయ్యెఁ పరమాత్మునకున్‌
     గొల్లసతి యా యశోదయుఁ
     దల్లియునై చన్నుగుడిపెఁ దనరఁగఁ కృష్ణా!13
క. అందెలు గజ్జెలు మ్రోయఁగఁ
     జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
     నందుని సతి యాగోపిక
     ముందఱ నాడుదువు మిగుల మురియుచుఁ గృష్ణా!14
క. హరిచందనంబు మేనునఁ
     గరమొప్పెడు హస్తములను గంకణ రవముల్‌
     ఉరమున రత్నము మెఱయఁగఁ
     బరఁగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణా!15
క. పాణితలంబున వెన్నయు
     వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం