పుట:2015.370800.Shatakasanputamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తుని గటువచోహతిచే నొప్పించితినని కవి పరితపించు దీనవాక్యములు హృదయదారణములు. ఏతదుత్తమశతకరచనమూలమున నీకవికీర్తి యాచంద్రతారమై వెలుగుచున్నది.

ఈశతకము యుక్తియుక్తములగు సామెతలతో మృదుమధురములగు మాట పొందికలతో శతకవాఙ్మయమునకు భూషణప్రాయముగనున్నది. ఆంధ్రదేశమును యవనదళములు ముట్టడించి చేసినకల్లోలములకు, దేశీయులు లంచగొండులై వారి ధాటి కవకాశము లొసంగి యాత్మహత్యాసమమగు నాత్మవంచనమునకుఁ బాలుపడినందుల కీశతకము తార్కాణము కాగలదు.

ఇట్టి విప్లవపరిస్థితులలో రచింపఁబడిన వెంకటాచలవిహారశతకము, మట్టపల్లి నృసింహశతకము లోనగునని చూచుట కాంధ్రప్రపంచ మాతురపడుచున్నది. వావిళ్లవా రాగ్రంథముల లోకమున కొసంగ బ్రార్థితులు.

ఇట్లు,

నందిగామభాషాసేవకులు,
1-1-25శేషాద్రిరమణకవులు