పుట:2015.370800.Shatakasanputamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూర్మనాథుఁ డాసమయమున ధర్మసంరక్షణార్థము లెమ్మని సింహాద్రి నారసింహస్వామిని చుఱుకుపలుకులతోఁ బ్రోత్సహించి, నిందించి, కటూక్తులాడి ఆలయము ముం దేకపాదమున నిలిచి యఱువదియెనిమిది పద్యములను రచించెను. తురక లీపేదబాపని లక్ష్యపెట్టక దురంతములు గావింపసాగిరి. కూర్మనాథుని పలుకువాఁడికి నొచ్చి నృసింహస్వామి [1]కందిరీగల తెట్టెను లేపఁగా నది తురకలం గుట్టి నానానస్థలఁ బెట్ట దిక్కు చెడి తలకొకదిక్కై నిలువ నీడలేక యవనులు పాఱిపోయిరి.

జనపరంపర చెప్పుకొను నీకథ విశ్వాసపాత్ర మనుటకు అఱువది యెనిమిదపపద్యము మొదలు “నీదు కరుణఁగంటి మిప్పుడు ” "జయమయ్యె యవనరాట్సంతమసము బాసె” అని నృసింహుని కవి సంకల్పసిద్ధుఁడై ప్రశంసించుటయే దృష్టాంతము కాఁగలదు.

కూర్మనాథుకవి మృదుపదగుంభితము. ఇతని నుడి పొందికలో శిలల కైన జీవశక్తి గలిగించు నొకయమోఘశక్తి గలదు. లోపముల నెత్తిపొడిచి యచేతనమగు శిలావిగ్రహముచేఁ బనిగొన్న యీ

కవిశక్తి ప్రశంసార్హము. కార్యాంతమున భగవం

  1. ఈయంశము దెలుపుపద్యము లీశతకమున నుదాహరింపఁబడియున్నది. చూ. ప.