పుట:2015.370800.Shatakasanputamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో
     త్కర మొనరించితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!77
ఉ. సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
     ర్వంకషలీల నుత్తమ తురంగమునెక్కి కరాసిఁబూని వీ
     రాంక విలాసమొప్పఁ [1]గలికాకృతి సజ్జనకోటికిన్‌ నిరా
     తంక మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!78
చ. మనమున నూహపోహణలు మర్వకమున్నె కఫాదిరోగముల్‌
     దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
     ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
     ల్తనువునకున్‌ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!79
చ. ముదమున కాటపట్టు భవమోహమద ద్విరదాంకుశంబు సం
     పదల కొటారు కోరికల పంట పరంబునకాది వైరుల
     న్నదన జయించుత్రోవ విపదబ్ధికి నావ గదా సదాభవ
     త్సదమల నామసంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ!80
చ. దురితలతానుసారి భయదుఃఖకదంబము రామనామ భీ
     కరతర హేతిచేఁదెగి వకావకలై చనకుండ నేర్చు నే

  1. కలిక్యాకృతి యనుటకు కలికాకృతి యనెను.