పుట:2015.370800.Shatakasanputamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. పదయుగళంబు భూగగన భాగములన్‌ వెసనూని విక్రమా
     స్పదుఁడగు నబ్బలీంద్రునొక పాదమునం దలక్రిందనొత్తి మే
     లొదవ జగత్త్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి
     త్సదమలమూర్తి వీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!73
చ. ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే
     బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి భూ
     సురవరకోటికిన్‌ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
     ధరణినొసంగితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!74
చ. దురమునఁ దాటకం దునిమి ధూర్జటివిల్‌ దునుమాడి సీతనుం
     బరిణయమంది తండ్రిపనుపన్‌ ఘనకాననభూమి కేఁగి దు
     స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
     ధరములఁ గూల్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!75
చ. అనుపమ యాదవాన్వయసుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తి నీ
     కనుజుఁడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
     తనయుఁడనంగ బాహుబల దర్పమునన్‌ బలరామమూర్తివై
     తనరిన వేల్పవీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!76
చ. సురలునుతింపగాఁ ద్రిపుర సుందరులన్‌ వరియింప బుద్ధరూ
     పరయఁగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించుచున్నప్పుడా