పుట:2015.370800.Shatakasanputamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     భారముఁ దాల్పఁగా జనులు పావనమైన పరోపకార స
     త్కార మెఱుంగలే రకట దాశరథీ! కరుణాపయోనిధీ!68
ఉ. వారిచరావతారమున వారధిలోఁ జొఱఁబాఱిఁ క్రోధ వి
     స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్‌
     జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్‌ మహో
     దారతనిచ్చితీవెగద దాశరథీ! కరుణాపయోనిధీ!69
చ. కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు ద్రాడుగా
     దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
     ధరణిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
     ధరము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!70
ఉ. ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుఁడ
     వ్వారిధిలోన డాఁగినను వానివధించి వరాహమూర్తివై
     ధారుణిఁ దొంటి కైవడిని దక్షిణశృంగమునన్‌ ధరించి వి
     స్తార మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!71
చ. పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా
     పటలము గప్ప నుప్పతిలి భండనవీథి నృసింహభీకర
     స్ఫుటపటుశక్తి హేమకశిపున్‌ విదలించి సురారిపట్టి నం
     తటఁగృపఁజూచితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!72