పుట:2015.370800.Shatakasanputamu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తముఁ గొల్చునట్టి నీ
     దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ!64
చ. చరణము సోఁకినట్టి శిల జవ్వనిరూపగు టొక్కవింత సు
     స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
     స్మరణఁ దనర్చుమానవులు సద్గతిఁజెందిన దెంతవింత యీ
     ధరను ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ!65
ఉ. దైవము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నె కా
     భావన సేయుచున్న తఱిఁబాపములెల్ల మనోవికార దు
     ర్భావితుఁజేయుచున్నవి కృపామతివై నను గావుమీ జగ
     త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!66
ఉ. వాసవ రాజ్యభోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
     ఉయాసకు మేరలేదు కనకాద్రిసమానధనంబు గూర్చినం
     గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్‌
     వీసరబోవ నీవు పదివేలకుఁజాలు భవంబునొల్ల నీ
     దాసునిగాఁగ నేలికొను దాశరథీ! కరుణాపయోనిధీ!67
ఉ. సూరిజనుల్‌ దయాపరులు సూనృతవాదులలుబ్ధమానవుల్‌
     వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్‌ మహీ