పుట:2015.370800.Shatakasanputamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     మూలను దాచుకోఁగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
     ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!56
చ. వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితంబు వమ్ముగా
     వలదు పరాకు నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే
     వలదు పరాకు నా దురిత వార్ధికిఁదెప్పవుగా మనంబులో
     దలఁతుమె కా నిరంతరము దాశరథీ! కరుణాపయోనిధీ!57
ఉ. తప్పులెఱుంగలేక దురితంబులు సేసితినంటి నీవు మా
     యప్పవుగావుమంటి నిఁక నన్యులకున్‌ నుదురంటనంటి నీ
     కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటనంటి నా
     తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!58
చ. ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి నేనెపో
     పతితుఁడనంటిపో పతితపావనమూర్తివి నీవుగల్గ నే
     నితరుల వేఁడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ
     యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ
     ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ!59
ఉ. అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
     క్షించినఁ జాలు దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ