పుట:2015.370800.Shatakasanputamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. జనవర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా
     నినద వినోదముల్‌ సలుపు నీచునకున్‌ వరమిచ్చినావు ని
     న్ననయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
     దననుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ!44
ఉ. పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం
     దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
     బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం
     తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ!45
చ. అగణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్‌
     దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ
     దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే
     తగదని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!46
ఉ. నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం
     బానకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క "రా
     మా! ననుఁగావు"మన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్‌
     దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!47
చ. పరధనముల్‌ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్‌
     మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు