పుట:2015.370800.Shatakasanputamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     కన్న మహాత్ముఁడుం బతిత కల్మషదూరుఁడు లేఁడునాకు వి
     ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!39
ఉ. పెంపనుఁ దల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర
     క్షింపను దండ్రివై మెయువసించు దశేంద్రియరోగముల్‌ నివా
     రింపను వెజ్జువై కృప గుఱించి పరంబు దిరంబుగాఁగ స
     త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!40
ఉ. కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం
     రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
     పక్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్‌ జగ
     ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!41
ఉ. గద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె
     న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్‌
     ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే
     తద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ!42
చ. కలియుగ మర్త్యకోటి నినుఁ గన్గొనరాని విధంబొ భక్తవ
     త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁగ్రుంకుచో
     బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ
     తలఁపునలేదే సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ!43