పుట:2015.370800.Shatakasanputamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. అవనిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
     కువలయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
     నవనవయౌవనంబను వనంబునకున్‌ మదదంతి వీవెకా
     దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!35
చ. ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
     జ్వరపరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జవి
     స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
     ద్ధరబిరుదాంక యేమఱకు దాశరథీ! కరుణాపయోనిధీ!36
ఉ. జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్‌
     జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
     జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్‌ గనువారిపదంబుఁ గూర్పవే
     తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!37
ఉ. ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్‌ దరిద్రతా
     కారపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర
     ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ
     తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!38
ఉ. విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా
     కన్నదురాత్ముఁడు బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ