పుట:2015.370800.Shatakasanputamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాసి గోదావరిలో విడువసాగెననియు నేటి కెదురీదివచ్చిన పద్యములనే సమకూర్చెనని ప్రజలు చెప్పుకొనుకథ శతకస్థపద్యములన్నియు నన్నిరత్నములని తెలుపుటకుఁ బర్యాయపదము.

నేలకొండపల్లి రామదాసు నివాసమని విని మే మట రామదాసునిగూర్చి వారివంశీయులను గూర్చి విచారింపఁగా నచటివారు గృహస్థలముమాత్రము చూపి యావంశము నశించినటులఁ జెప్పియున్నారు. కంచర్ల శరభకవి యధ్యాత్మరామాయణములోని

తే. కొండపల్లిని గొందఱు గొల్లపూఁడిఁ
     గొంద ఱుండిరి తంజాపు రందుఁ గొంద
     ఱెలమి వసియించి ప్రబలిరి చెలువు మిగుల
     మీఱి కంచర్లవంశంబువారు ధరణి.”

అను పద్యమువలన కంచెర్లవారు నేలకొండపల్లె పూర్వము నివసించి రనుట విశ్వాసార్హ మె. నూఱుసంవత్సరములకుఁ బైకాలమునందున్న తిరుక్కడయూరి కృష్ణదాసు రామదాసుచరిత్రమును వ్ యుచు నందు రామదాసుఁ డక్కన్నమాదన్నల మేనల్లుఁడని చెప్పి

తోహరా. శ్రీమించిన నెలకొండపల్లెలో
     శిష్టజనులు పొగడఁగనూ