పుట:2015.370800.Shatakasanputamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నమితముగ నచ్చోటను -గర్భనరకమునఁ బడు నారాయణా. 63
ఈశ్వరాజ్ఞను బుట్టిన -తెలివిచే హృదయమునఁ దలపోయుచు
విశ్వమునఁ దను బొందిన -పాటెల్ల వేర్వేఱు నారాయణా. 64
చాలు చీ! యిక జన్మము -నిఁకఁ బుట్టుఁ జాలు, శ్రీహరి భజించి
మేలు చెందెద ననుచును -జింతించు నాలోన నారాయణా. 65
ప్రసవకాలమునఁ దల్లి -గర్భమునఁ బాదుకొని నిలువలేక
వసుధపయి నూడిపడినఁ -దెలివిచే వాపోవు నారాయణా. 66
చనుఁబాలు గుడిచి ప్రాణ -ధారణను నిఁక మూత్ర మలము
లోను, మునిఁగితేలుచునుండును, దుర్గంధమున నారాయణా. 67
బాలత్వమున బిత్తరై -నలుగడలఁ బాఱాడు సిగ్గులేక
పాలుపడి యౌవనమునఁ -విషయానుభవమొందు నారాయణా. 68