పుట:2015.370800.Shatakasanputamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీ పాదములఁ జెందినఁ -జల్లనై నిలిచెదను నారాయణా. 19
చింతా పరంపరలచేఁ -చిత్తంబు చీఁకాకు పడుచున్నది,
సంతోషమునఁ గూర్పవె -దివ్య ప్రసాదములు నారాయణా. 20
ప్రాయమెల్లను బోయెను -నాశ లెడఁ బాయఁ జాలక యున్నవి
మాయా ప్రపంచమేల -చేసెదవి మాయయ్య నారాయణా. 21
శరణుఁ జొచ్చినవాఁడను -నేఁ జేయుదురితముల నపహరించి
పరమ పద మొసఁగఁ గదవె -యిఁకనైనఁ బరమాత్మ నారాయణా. 22
సంకల్పములు పుట్టినఁ -గర్మ వాసనల దృఢముగఁ జేయవు
సంకటము నొందించకే -నను సత్య సంకల్ప నారాయణా. 23
ఒకవేళ నున్న బుద్ధి -యొక వేళ నుండదిఁక నేమి సేతు
విశదంబుగాఁ జేయవే -నీవు నా చిత్తమున నారాయణా. 24