పుట:2015.370800.Shatakasanputamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేహమే దృఢమనుచును -దెలిసి నే మోహబద్ధుఁడ నగుచును,
సాహసంబున జేసితిఁ -నేగురు ద్రోహంబు నారాయణా. 14
ఎన్ని జన్మము లాయెనో -నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిఁ జేర్పఁ గదవొ -యిఁకనైన నా తండ్రి నారాయణా. 15
యమ కింకరులఁ దలఁచిన -నాగుండె యావులింపుచు నున్నది
యముని బాధలు మాన్పను -మాయప్ప వైద్యుఁడవు నారాయణా. 16
అరయఁ గామ క్రోధముల్ -లోభంబు మోహమద మత్సర
ములు, తఱుఁగ వెప్పుడు మనసున -నిన్నెపుడుఁ దలచెదను. 17
ఆశా పిశాచి పట్టి, -వైరాగ్య వాసనలఁ జేరనీయదు
గాసి పెట్టుచు నున్నది -నేనేమి చేయుదును నారాయణా. 18
తాపత్రయంబుఁ జెంది -చాలఁ బరితాప మొందెడు చిత్తము