పుట:2015.370800.Shatakasanputamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక.

ఈనారాయణశతకము గేయముగఁ బూర్వకవి యెవరో రచించెను. ఇందలి గేయము పదలాలిత్యముతోఁ గూడికొని చదువుకు ననుకూలమగు మృదుశైలిలోఁ బండితపామరరంజకముగా నున్నది. ఇందలి రచనసందర్భము, కవితా ప్రౌఢి, విషయసంగ్రహణముఁ బరిశీలింప నీ గ్రంథకర్త సంస్కృతాంధ్రములలో విద్వాంసుఁడనియు శిశుబాలబోధకై వేదాంతభావములను బదములలో నిముడ్ప సంకల్పించి యీపొత్తమును రచించెనని తోఁచుచున్నది. "సూక్ష్మములో మోక్ష” మన్నటుల ఈశతకము మిగులఁ జిన్న దైనను అద్వైతసంప్రదాయానుకూలము లగు తత్త్వరహస్యములను సుబోధముగ నెఱింగించుచున్నది.

మొదట మానవుఁడు యుక్తాయుక్తజ్ఞానశూన్యుండై స్వేచ్ఛగా సంచరించి విషయాదిసౌఖ్యము లనుభవించి విసుఁగొంది తత్త్వవిచారమునకుఁ దొరగొనుట సహజముగాన, కవియుఁ దొలుత స్వేచ్ఛావర్తనను దానఁగలకష్టములు దెలిపి పిదప నీశ్వరతత్త్వనిరూపణ మొనరించుఁ బ్రపంచసృష్టి నెఱుంగం