దితిపర్యాప్తిదినంబు లొంది త్రిజగద్విఖ్యాతియుష్మత్సము
న్నతసేవాభిముఖుండ నైతి నిట కృష్ణా! దేవకీనందనా!79
మ. పలుమాఱున్ ఇహభోగకాంక్షసభలన్ పాండిత్యముల్ సేయువా
రలయజ్ఞానము మాన్పఁగాఁ గలరె యెట్లైనన్ బ్రకాశించు కో
మలదీపాళిఁదొలంగఁ ద్రోయునె భవన్మాయాంధకారంబును
జ్జ్వలితానందమయ స్వరూపయుత కృష్ణా! దేవకీనందనా!80
మ. ఉర్విం బాఱుమహానదీజలము లాయూరూరునందెల్లఁ గూ
డురుఘోషంబున వంకలై కలియఁగా యోగ్యంబు లైనట్లు మీ
స్మరణన్ నానుడువున్ సదాశుభములై సంపూజ్యమున్ గా భవ
చ్చరణంబుల్ మది నిల్పి కొల్చెదను కృష్ణా! దేవకీనందనా!81
శా. బాలక్రీడలఁ గొన్నినాళ్లు పిదపన్ భామాకుచాలింగనా
లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్లు మఱియిల్లున్ ముంగిలింగొన్ని నా
ళ్లీలీలన్ విహరించితిన్ సుఖఫలం బెందేనియున్ లేదుగా
చాలన్ నీపదభక్తిఁ జేసెదను కృష్ణా! దేవకీనందనా!82
మ. మతిలో మిమ్ముఁదలంచు పుణ్యుఁడిలఁ దామాయన్ స్వదారాదుల
న్వెతలం బొర్లఁడు భాగ్యవంతుఁడగుఠీవిన్ దివ్యమృష్టాన్న సం
గతిలోనాడి మనుండు భిక్షమునొసంగన్ నేర్చునే శూలభృ
పుట:2015.370800.Shatakasanputamu.pdf/159
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
