శా. నీడల్ దేఱెడు చెక్కుటద్దములతో నిద్దంపుఁగెమ్మోవితో
కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో
వ్రీడాశూన్య కటీరమండలముతో వేడ్కన్ వినోదించుచు
న్నాఁ డా శైశవమూర్తి నేఁ దలఁతుఁ గృష్ణా! దేవకీనందనా!4
శా. అందెల్ చిన్నిపసిండిగజ్జియలు మ్రోయన్ మేఖలాఘంటికల్
క్రందై మ్రోయఁగ రావిరేకనుదుటన్ గంపింప గోపార్భకుల్
వందారుల్ గన వెన్నముద్దలకు నై వర్తించు మీబాల్యపుం
జందం బాదివిజుల్ నుతించుటలు కృష్ణా! దేవకీనందనా!5
శా. వేదోద్ధారకుఁగా సుధాప్రభువుఁగా విశ్వంభరావాహుఁగా
వాదావిర్భవుఁగా త్రయీవటువుఁగా వర్ధిష్ణుతాయుష్యుఁగా
కోదండాశుగపాణిఁగా బలునిఁగా ఘోరవ్రతచ్ఛేదిఁగా
నాదిబ్రహ్మముఁగాఁ దలంతు మదిఁ గృష్ణా! దేవకీనందనా!6
మ. అమరుల్మ్రొక్కులచే మునుల్ నుతులచే నార్యుల్మహానిష్ఠచే
సమరోత్సాహజనుల్ పునశ్చరణచే సాధుల్ దయాబోధచే
నమితోదారకళాఢ్యు లర్పణలచే నధ్యాత్ము లైక్యంబుచే
సమతం గాంచిరి మీపదాబ్జములు కృష్ణా! దేవకీనందనా!7
పుట:2015.370800.Shatakasanputamu.pdf/141
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
