పుట:2015.370800.Shatakasanputamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నున్నటులఁ దెలియుటచే క్రీ. శ. 1422-1440లోగనుండియుండుననియుఁ దలంప వీలుకలుగుచున్నది. ఇతరాధారములు లభించువఱకు దేవకీనందనశతకము రచనాకాలము గ్రంథకర్తృనామము పైనిర్ణయముతో సరిపుచ్చుకొనవచ్చును. ఈశతకమున వ్యాకరణదోషములు గనుపట్టుచున్నవి.

అయినను అప్పకవివంటి లాక్షణికుఁడు ఇందలి పద్యములు ఉదాహరణమునకుఁ దీసికొనుటవలన నీశతకప్రశస్తి యప్పకవి కాలమునకే సుప్రసిద్ధముగా నుండె ననుటకు సంశయము లేదు. లిఖితప్రతి యొకదానిలో నీశతకము కవిరాక్షసుఁడు వ్రాసినటులఁగలదు. కవిరాక్షసుఁడే జన్నయ్యకవియో యాబిరుదనామ మెవరిదో యెఱుంగ వీలుకాదు. మఱియు నాపద్య మొకప్రతియందే గానవచ్చుట వలన నెంతవఱకు విశ్వసనీయమో యెఱుంగనయితి గాదు.

ఈ శతకమును నిర్దుష్టముగా ముద్రించి యాంధ్రదేశీయుల కందించిన వావిళ్లవారి ప్రయత్నము ప్రశంసాపాత్రము.

నందిగామశేషాద్రిరమణకవులు,
1-1-25శతావధానులు.