పుట:2015.370800.Shatakasanputamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమాసకల్పితమై యుంటచేఁ బఠనయోగ్యముగ నున్నది. శతకమున 100 పద్యములు మాత్రమె కలవు. ఫలశ్రుతి తెలుపుపద్యము కందపద్యముగ నున్నది. కవిచరిత్రముగల పద్యము స్తుతివిషయికపద్యములు లోపించి యుండునని తోచుచున్నది. శతకమువలన మాత్రము గ్రంథకర్తను నిరూపింప వీలు చిక్కదు గాన, సాధనాంతరము లన్వేషించి గ్రంథకర్తృనామము కాలము తెలిసికొనఁ బ్రయత్నింపుదము.

జక్కనకవి విక్రమార్కచరిత్రమునఁ గృతిపతివంశావతారముఁ జెప్పుకొనుచుఁ గృతిపతితండ్రి యగు జన్నమంత్రి నీవిధముగాఁ బ్రశంసించి యున్నాడు.

సీ. పరమహృద్యంబైన పద్యశతంబున
     దేవకీతనయు విధేయుఁ జేసె
     ... ... ... ... ... ... ... ...
     హరితమునివంశరత్నరత్నాకరేంద్ర
     చంద్రుఁడై యొప్పు సిద్ధయజన్నమం త్రి.

దీనివలన దేవకీతనయశతకము రచించినది హరితసగోత్రుడగు జన్నమంత్రియనియు నతఁడు దేవరాయ మహారాయల యాస్థానమున మంత్రిగ