పుట:2015.370800.Shatakasanputamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     గ్రామంబుల్ నగరంబులున్ విభవముల్ రాజ్యంబులున్ రత్నముల్
     రామారత్నము లేమిలెక్క రఘువీరా! జానకీనాయకా!50
శా. గోమేధాధ్వర వాజిమేధశతముల్ గోదాన భూదానముల్
     హేమాద్రుల్ తిలపర్వతంబులు సువర్ణేభాశ్వదానంబులున్
     నీ మంత్రంబగు నక్షరద్వయముతో [1]నే నీపుణ్యముం బోల వో
     రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!51
శా. గోమాంసాశని, మద్యపాని, నగరిన్ గొండీఁడుఁ, చండాలుఁడున్
     హేమస్తేయుఁడు, సోదరీరతుఁడు, గూ డేకాదశిన్ భుక్తిగొ
     న్నామూఢాత్ముఁడు లోనుగాఁ గలుగు దుష్టాచారుఁడైనం దుదిన్
     రామా! యన్నను ముక్తిఁ గాంచు రఘువీరా! జానకీనాయకా!52
శా. ఏమీ పాతకులార! మా పురికి రా రీపట్టునం దున్నత
     శ్రీమైఁ బోయెద రెందుకన్న జమునిం గ్రేగన్నులం జూచుచున్
     రామయ్యా! యిఁక నంచుఁ బల్కి యపవర్గస్థానమున్ జొత్తురో
     రామయ్యా! నినుఁ గొల్చువారు రఘువీరా! జానకీనాయకా!53
శా. స్వామిద్రోహికిఁ దమ్ముఁడెట్లు? ఘనరాజ్యంబేల నీవిచ్చుటె?
     ట్లామాటల్ విని కాదె నిన్నడుగ నత్యాసక్తి నాకున్న దొ

  1. పొందేపుణ్యముం