పుట:2015.370800.Shatakasanputamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     జనుఁ జండాలకులంబులోన నుదయించం గోరి నీ నామకీ
     ర్తన సేయ న్నిరసించెనేని రఘువీరా! జానకీనాయకా!42
మ. జనకుం డెవ్వఁడు నీకు? నీ కడుపులో సర్వంబు నుండంగ నీ
     యునికి స్థానము దుగ్ధవార్ధి నడుమన్ యోగీంద్రహృద్గేహ! యే
     మని వర్ణింపుదు నీ మహత్త్వములు సర్వాశ్చర్యముల్ పుణ్య వ
     ర్తన రాజన్యయశోవిహార రఘువీరా! జానకీనాయకా!43
మ. జనకుండా జనకుండు నీ సతికిఁ, గౌసల్యా యహల్యాఘమో
     చన!నిన్ గాంచిన తల్లి, పంక్తిరథుఁడా సర్వేశ! మీ తండ్రి, యే
     మి నిమిత్తంబున నుద్భవించితి[1]వొ నెమ్మి న్నిట్టు లీపుట్టు వు
     గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!44
మ. హనుమంతుం డొక యబ్ధి దాఁటె నని యేలా ప్రస్తుతుల్ సేయఁగా
     దనుజారాతి! భవత్పదాబ్జములు హృత్పద్మంబున న్నిల్పు నా
     ఘనపుణ్యుండు భవాంబురాశులు తృణీకారంబుగా దాఁటు బో
     రన నెన్నైనను గొంకులేక రఘువీరా! జానకీనాయకా!45
శా. నీ పాదోదక మక్షులం దదుముకొంటిం, గొంటి నాలోనికిన్,
     నీ పళ్లెంబు ప్రసాదముం గుడిచితిన్, నీ పేరునుం బెట్టితిన్,

  1. వి నెమ్మిన్నిట్టు లీపుట్టువు