పుట:2015.370800.Shatakasanputamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     గ్రతువిఘ్నం బొనరించు దానవుల వీఁకం దోలఁగా లేక నాఁ
     డతిబాలున్ నినుఁ దోడు తోడుకొనిపోఁడా గాధిసూనుండు నీ
     ప్రతివీరాగ్రణి యెవ్వఁ డింక? రఘువీరా! జానకీనాయకా! 25
మ. క్షితిలో నల్పులమీఁదఁ జెప్పిన కృతుల్ ఛీఛీ నిరర్థంబులౌ
     నుతిపాత్రమ్ములు గావు మేఁక మెడ చన్నుల్ నేతిబీఱల్సుమా
     వితత ప్రౌఢిమ నీకుఁ జెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భా
     రత రామాయణముల్ దలంప రఘువీరా! జానకీనాయకా!26
శా. సంతానంబును బారిజాతకమహీజాతంబు మందారమున్
     జింతారత్నముఁ గామధేనువు సుధాసింధూత్తమంబున్ మదిన్
     జింతింపన్ సరిగావు నీకు విజయశ్రీధామ! యో రామ! య
     శ్రాంతత్యాగ వివేకపాక! రఘువీరా! జానకీనాయకా!27
శా. ఏ దైవాల వరాలకంటె సులభం బెవ్వారికైనన్ మదిన్
     నీ దాతృత్వము చెప్పనేల శరణంటేన్ గాతు వింతేల నీ
     పాదాంభోజరజంబు రాతికయినన్ బ్రాణంబు లీఁజాలు నౌ
     రా! దిక్పూరితకీర్తిపూర! రఘువీరా! జానకీనాయకా!28
శా. విందున్ వేదపురాణశాస్త్రముల గోవిందున్ ముకుందున్ హరిన్
     విందున్ వేల్పులలోన భక్తసులభున్ విశ్వంభరున్ సచ్చిదా