పుట:2015.370800.Shatakasanputamu.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ద్రిగుణాకారముఁ దాల్చినట్టి వరమూర్తీ! వాసుదేవా! హరీ!
     నిగమస్తుత్యపవిత్రగాత్ర! నృహరీ! నీలాభ్రవర్ణా! మహో
     రగతల్పా! జనకల్పభూజ! రఘువీరా! జానకీనాయకా!8
శా. నీ చారిత్రముఁ జెప్ప నద్భుతమగున్, నీ నామసంకీర్తనం
     బాచండాలునకైన మోక్ష మొసఁగున్, హత్యాదిదోషంబులన్
     వే చించున్ విదళించుఁ ద్రుంచుఁ దునుమున్ వేఁటాడు నంటంబడున్
     రాచుం ద్రోచు నడంచు నొంచు రఘువీరా! జానకీనాయకా!9
శా. తేజం బొప్పఁగ నీవె కావె మొదలం ద్రేతాయుగాంతంబునన్
     రాజై పుట్టితి వింక నీకలియుగాంత్యం బందునన్ రౌతవై
     వాజిం దోలి విరోధులం దునుమ దేవా! నీవ యొండెవ్వఁ డా
     రాజున్ రౌతును నీవె కావె రఘువీరా! జానకీనాయకా!10
శా. గాజుం బూస సురేంద్రనీలమణిగాఁ గల్పించు చందంబునన్
     బాజుం జర్మము మీఁది బేగడపొరల్ బంగార మౌ రీతిగన్
     నా జన్మంబు పవిత్రభాజనముగా నన్నేల రావేలరా
     రాజీవాక్ష! కృపాకటాక్ష! రఘువీరా! జానకీనాయకా!11
శా. నా జన్మాంతర వాసనావశమునన్ నాపాలి భాగ్యంబునన్
     నా జాడ్యంబులు పోవుకాలముతఱిన్ నా పుణ్యపాకంబునం