పుట:2015.370800.Shatakasanputamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. సకృపాలోకన! నందగోపుని తనూజాతుండవై గొల్లవై
     సకలక్షోణుల నేలినాఁడవఁట, మించం గశ్యపబ్రహ్మ గ
     న్న కుమారుండన మిన్నుముట్టి కుఱుచై నాఁడేల నాడేల నే
     రక దానంబుగ వేఁడుకొంటి రఘువీరా! జానకీనాయకా!4
మ. సకలామ్నాయములం బఠించు ఫల మబ్జాతాక్షు నామంబులం
     దొక టేదైనఁ బఠింపఁ గల్గు నటువం టుత్కృష్ట పుణ్యప్రవ
     ర్తకనామంబులు చక్రపాణికి సహస్రంబుండుఁ దత్తుల్య మ
     ర్కకులా! నీ శుభనామ మౌర! రఘువీరా! జానకీనాయకా!5
శా. కొంకన్ గారణ మేమి ధర్మములు పెక్కుల్ చేసి మర్త్యుండు నీ
     వంకం జిత్తము నిల్పలేక పెరత్రోవల్ త్రొక్కినన్ సర్వముం
     బొంకై పోవుఁ; గురంగనేత్ర తగునోముల్ వేయునున్ నోచి తా
     ఱంకాడంగఁ దొడంగినట్లు రఘువీరా! జానకీనాయకా!6
శా. ఆ గౌరీశ్వరకీర్తనీయుఁ డగు ని న్నర్చింపఁగా లేనివా
     రోగు ల్గారొకొ చాల యోగ్యులయినన్ యోగానుసంధాను లీ
     మాగుల్గాన యథార్థమాడితిని నీమంత్రంబె మంత్రంబురా!
     రాగద్వేషవిదూర! ధీర! రఘువీరా! జానకీనాయకా!7
మ. జగముల్ మూఁడు సృజింపఁబ్రోవఁ బిదపన్ సంహారముం జేయఁగాఁ