పుట:2015.370800.Shatakasanputamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

అయ్యల్రాజు త్రిపురాంతకకవివిరచిత

ఒంటిమిట్ట రఘువీరశతకము

శా. శ్రీకల్యాణగుణాభిరామ! విబుధశ్రేణీ కిరీటద్యుతి
     వ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ! సహస్రాక్షస్తుతా! యచ్యుతా!
     నాకుం బ్రాపును దాపు నీవె యగుచున్ నన్నేలుమీ రామభ
     ద్రా! కారుణ్యసముద్ర! ధీర! రఘువీరా! జానకీనాయకా!1
శా. ఆ కర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబులో
     నా కావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా
     నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నా జిహ్వకున్
     రాకుంటెట్లు? వసించుఁగాక రఘువీరా! జానకీనాయకా!2
శా. నీ కేలన్ దృణ మంది వైవ నదియున్ నిర్ఘాతపాతక్రియన్
     గాకాకారనికారదానవుని లోకాలోకపర్యంత మీ
     లోకంబుల్ పదునాల్గు త్రిప్పినది కాలున్మోపఁగానీక యౌ
     రా! కాకుత్స్థ కులాగ్రగణ్య! రఘువీరా! జానకీనాయకా! 3