పుట:2015.370800.Shatakasanputamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

     జగదేకఖ్యాతిధుర్యాయ్యల్రాజు తిప్పయమనీషి పర్వతాభిదా
     నపౌత్ర..........”

రామాభ్యుదయము.

ఈకవి రామాభ్యుదయకర్త యగు రామభద్రకవికి ముత్తాత యని వీరేశలింగముపంతులుగారు వ్రాసియున్నారు. అది సరియని తోఁపదు. తిప్పయమనీషి పర్వతాభిధాను లన్నదమ్ములు కావచ్చును. ఇట్లయినచో రామభద్రకవి కీతఁడు పెత్తాతయగును. ఇతఁడు శ్రీకృష్ణదేవరాయల కించుక పూర్వుఁడగును,

ఈత్రిపురాంతకుఁడు కర్ణాటరాజుల యాస్థానమున సత్కారము లొందినటుల ఆకర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబులో నాకావ్యంబులు మెచ్చఁజేసితివి అను శతకస్థపద్యములవలనఁ దెలియుచున్నది. ఇతఁ డేనృపునిచే సత్కరింపఁబడెనో తెలియరాదు, కవి క్రీ 1480 ప్రాంతమున నుండియుండును. ఎఱ్ఱాప్రగడ వ్రాసిన నృసింహపురాణములోని పద్యమునందలి భావము నీ కవి సంగ్రహించియున్నాఁడు.

చ. మృగమదచందనాద్యనుపమేయసుఖోచితసారవస్తువుల్
     తగఁ గఫవాతపైత్యకలితంబగు కీడులప్రోకయైన యా
     యగుణశరీరముం గదిసినంతన దుష్టతఁ బొందు మేలుఁ గీ
     డుగ నొనరించు నీముఱికిడొక్క మనంబున నమ్మఁ బాడియే.

(చూడుము 32 పద్యము.)