పుట:2015.370800.Shatakasanputamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు.

ఆంధ్రభాషయందుఁ బ్రాచీనగ్రంథములు పెక్కులు నామమాత్రావశిష్టము లైనవి. కొన్ని మాఱుమూలల నణఁగిపోయినవి. ఈశతకరాజము నట్లే ఇంతవఱకు మాఱుమూలఁ బట్టియుండినది. ఇదియు సమగ్రముగాఁ దోఁపదు. ప్రాచ్యలిఖతవుస్తకభాండాగారమున రెండుమాతృకలుగలవు. వానిలో నొకట దాదాపు 110 పద్యములును మఱియొకట 40 పద్యములును గలవు. వానిలో నీశతకకర్తవిషయము కానరాదు. ఈ క్రింద నుదహరింపఁబడిన పద్యగద్యములవలన దీనికర్త కొడుకగు త్రిపురాంతకుడుగాఁ దెలియవచ్చు చున్నది.

[1]"మ. ఆతులప్రక్రియ మీఱురాయకని యయ్యల్రాజు సత్పుత్రుఁ డం
..... చితభ క్తిం ద్రిపురాంతకుండు విరచించెన్ గ్రొత్తపద్యంబులన్
     శతకం బొక్కటి దీని నీవు కొని యాచంద్రార్కమున్ నిల్పు ప
     ర్వతకన్యాసుత! యొంటిమిట్టరఘువీరా! జానకీనాయకా!"

గద్యము. ఇది శ్రీ మదొంటిమిట్ట రఘువీరశతకనిర్మాణకర్మఠ

  1. ఈ పద్యము తంజాపుర పుస్తకభాండాగారమున నున్నమాతృకలో గలదు.