పుట:2015.333901.Kridabhimanamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రేమాభిరామము

      రావిపాటిత్రిపురాంతక కవీశ్వరుడు ప్రేమాభిరామమను పేర సంస్కృతమున రచియించిన వీధీరూపకము ననుసరించి తెలుగున నీ క్రీడాభిరామము రచితమయ్యెనని యిందు గలదు.  ప్రేమాభిరామము నేడు గానరాదు.  ఈక్రీడాభిరామ మాప్రేమాభిరామచ్చాయ ననుసరించి రచించబడినదే  కాని దానికి సరి యయిన తెనుగు గాదు.  ఓరుగంటిప్ర్రాంతమున నున్నవాడు మఱింగంటి సింగరాచార్యుడు సీతాకళ్యాణ మనుగ్రంధల్మును దాను ప్రేమాభిరామమును ద్విపదకావ్యముగా రచించినట్లు చెప్పుకొన్నాడు.  ఆకవిగ్రంధంములు పెక్కులు దొరికినవి గాని ప్రేమాభిరామ ద్విపద దొరకలేదు.

"అనఘ! ప్రేమాభిరామ ధనాభిరామ
  కావ్యములు జాతివార్తలు గడలుకొనగ
  ద్విపదములుగ జేసితిని గడు గృపను నెన్న
  బూని షోడశవత్సరమ్లనె మొదల"--(R.708)
  

  త్రిపురాంతకు డాంధ్రకవీశ్వరులలో నురుపమానుడు.  తత్కృతి యుదాహరణ *మొక్కటిమాత్రము నేడు గానవచ్చుచున్నది.  ప్రబంధరత్నావళిలోఅంబికాశతకము, చంద్రతారావళియను తత్ కృతులలోని పద్యము లుద్దృతములై

  • మా. రామకృష్ణకవిగారు దాని బ్రకటించిరి.