పుట:2015.333901.Kridabhimanamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. మయరసతజభగణంబులు
    నయధనభయవిలయబంధనశ్రీతేజో
    జయములు క్రమమున నొసగును
    ప్రియసరసనచోభిరామ పిన్నసోమా !
క.సురనరతిర్యగౌరవ
   వరగతు లగుభూసురదివర్గాక్షరముల్
   గురులఘువులు నరసురగతు
   లరిరాయవిఫాల! సోమ! యవనీపాలా!

వీనిబట్టి యది 'పిన్నయసోమ ' భూపతిపేర జెప్పబడినట్లు తెలియనగును. అత డరెవీటి బుక్కరాయల వంశమున పూర్వుడే యని తలపదగును. పైపద్యము లిట్లు సోమభూపతిసంభోధనముతో నున్నను శ్రీధరచ్చందస్సులోనివిగా లక్షణగ్రంధములు దుదహృతము లగుపద్యములు పెక్కులు విష్ణుసంబోధనములతో గూడ నున్నవి. ఇం దేపద్యములి సరి యయినవో యెఱుగరాదు. ఆగ్రంధము దొరికినప్పుడుగాని దానిగూర్చి యిదమిత్ద మని నిర్ణయింపజాలము. శ్రీధరచ్చందము నేనుజూడలేదు కనుక జెప్పజాలను గాని తక్కినగ్రంధములందు క్రీడాభిరామపద్యములు వల్లభరాయనిపేర నుదాహృతము లయ్యె ననుట కాధారము నాకు గానరాలేదు. ఇప్పటికి గ్రీడాభిరామము శ్రీనాధకృతము కాదనువారి సర్వవాదములకు శక్యమైనంతవఱకు సమాధానము చెప్పితిని.