పుట:2015.333901.Kridabhimanamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంచకొదమలగమి బెదరించుపోల్కి
నందెచప్పుళ్ళు ఘల్లుఘల్లు నుచు మొఱయ
నడుము జవజవలాడ గీల్జడ ఘటించి
వచ్చె ముక్కంటిసేవకు మచ్చెకంటి.
సీ. తాటంక యుగధగద్ధగితకాంతిచ్చటల్
         చెక్కుటద్దములపై జీరువార
  నిటలేందుహరినీలకుటిఅకుంతలములు
       చిన్నారిమోమున జిందు ద్రొక్క
  బంధురమౌ క్తికప్రకటహారావళుల్
      గుబ్బచన్నులమీద గునిసియాడ
  గరకంకణక్వణక్వణవిశ్వణంబులు
      పలుమారు ఱాతిపై బరిధవిల్ల
  ఓరచూపుల విటచిత్త మూగులాడ
  బాహుకుశలత జక్కనిమోహనాంగి
  పాట బాడుచు గూర్చుండి రోటిమీద
  బిండి రుబ్బంగ గన్నులపండు వయ్యె
ఉ.కూటమి నొక్కనాటికి ద్రికోణసహస్రములం బగుల్చునీ
   ధాటికి జల్లడంబులును దారుణగోణము లంచుగోచులున్
   శాటులు నోర్వగాగలవె! చాలును నీదువిజృంభణం బయె
   యేటిక్జి లెవబాఱితివి యీసరిప్రొద్దుకడం బ్రజాపతీర్!
ఉ. మాపటికోండవీటికసుమాలపుదొత్తులు జూచి యేల యు
    త్ధాపనశక్తిచూపెదవు దబ్బఱశిళ్నను! వారిసౌమన