పుట:2015.333901.Kridabhimanamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క. తేలాకాయెను బోనము
   పలాయెను మంచినీళ్ళు, పడియుండుటకు!-
   నేలా కఱవాయె నిసీ !
   కాలినగురజాల నిష్టకామేశశివా.
        గురజాలలో శ్రీనాధుని కొకనాటిరాత్రై తిండి దొరకలేదు. తేలుగుట్టెను. మంచినీళ్ళును గఱవయ్యెను. నిద్రించుటకు దిననిచో టయినను గుదురలేదు. తేలుగుట్టిన బాధ తీఱుటకై నమలిమ్రింగిన మందాకే యాహార మయ్యెను. ఎవరో కవితాభిమాను లగుకాపులు తెచ్చి యిచ్చిన పాలే మంచినీళ్ళయ్యెను.
క. రసికుడు పోవడు పల్నా
   డెసగంగా రంభయైన నేకులె వడుకున్
   వసుధేశుడైన దున్నును
   గుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.
ఉ. దోసెడుకొంపలో బనులత్రొక్కిడి మంచము దూడరేణమున్
    బాసినవంటకంబు పసిబాలురశౌచము విస్తరాకులున్
    మాసినగుడ్డలుం దలపరారు పురోహితులింటికృత్యముల్.
       దీని వివృతిని చాటుపద్యమణిమంజరిలో జూడ
   దగును.
గీ. చిన్నచిన్నరాళ్లు చిల్లరదేవుళ్లు-నాగులేటినీళ్ళు నాపఱాళ్ళు
   సజ్జజొన్నగూళ్లు సర్పంబ్వులును దేళ్లు-పల్లెనాటిసీమపల్లెటూళ్లు.