పుట:2015.333901.Kridabhimanamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇప్పటికి బదునై దేండ్లకు బూర్వము శ్రీజయంతి రామయ్యపంతులుగారు మద్రాసులో ప్రెసిడెన్సీ మేజస్ట్రీటుగా నుండగా వారియింటికి విద్యావయోవృద్ధులు ప్రామాణికవిద్వాంసులు బ్రఖశ్రీ రామడుగు రామకృష్ణ శాస్త్రులు గారు విచ్చేసిరి. వారు శ్రీనాధునిపల్నాటి చాటుధారల నాకు జదివి చెప్పిరి. అప్పుడు నేనీ క్రింది పద్యములగొన్నింటి వ్రాసికొంటిని. చాటుపద్య మణిమంజరిలో బ్రకటించితిని. అంతకు బూర్వ మీపద్యము లెక్కడను బ్రకటిరములు గాలేదు.

ఉ.అంగడి యూర లేదు, వరియన్నము లేదు, శుచిత్వ మేమెలే,
   దంగన లింపులేరు, ప్రియ మైనవనంబులు లేవు. వీటికై
   భంగపడంగ బాల్పడుకృపావరు లెవ్వరు లేరు. దాత లె
   న్నంగను నున్న, గాన పలినాటికి మాటికి మాటికి బోవ వేటికిన్.
క.గుడిమీదిక్రోతితోడను
  గుడిలోపలివారికోడలితోడన్
  నడివీధిలం జెతోడను
  నడిగొప్పులహోరుగాలి నడిగితి ననుమీ.

  ఈ పైపద్యమునకు గంధాసంధర్భము లున్నవి.  శ్రీనాధు డొకనాటిరాత్రి యాయూర ననుభవించిన కష్టసుఖముల నీపద్యమున జెప్పుకొన్నాడు.  అడిగొప్పులలో నేటికిని దఱుచుగా హోరుగాలి వీచుచుండునట!