పుట:2015.333901.Kridabhimanamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వాంసుల్ రాజమహేంద్రపట్టణమునన్ ధర్మాసనంబుండి ప్ర
ధ్వంసాభావము ప్రాగభావమనుచున్ దర్కింతులెల్లప్పుడున్.

ఈముదుకపరిహాసమునకు దార్కికులు నాటికి నేటికిని పంపవలసినదే గదా ! మహావిద్వాంసుడయ్యు శ్రీనాధుడు డిట్టి స్త్రీలౌల్యమునజెడ్డాడని రాజమహేంద్రవరమున సోమయాజులు నిరసింపగా శ్రీనాధు డీ పద్యమును జెప్పెనట.
మ.శృతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుడంత నానాధ్వర
   వ్రతుడై పోయి కనున్ బురందరారామద్రుమానల్పక
   ల్పతరుప్రాంతలతాకుడుంగసుఖసు ప్తప్రాప్తప్తరంభాభగ
   ప్రతిరోమాంకురపాటవక్రమకళాపాండిత్యశాండీర్యమున్.
     
      ఆ యాక్షేపమును నీసమాధానమును వివేకులు విమర్శించి చూచినచో నిది శ్రీనాధుడే చెప్పదగిన పద్యమని తప్పకతోచును. ఈ పద్యముతో రచనాసామ్యము గల
పద్యము తిక్కనది గలదు.

‘చ. ఉలిమిడిచెక్కయున్ మిగులనుక్కయు జప్పని రొట్టె
                             ముక్కయున్
     మలినపుగుడ్డలున్ నులకమంచపుగుక్కియు జీకటిల్లునుం

—————————————————————————————————————————————————————————- ^ బహుస్థలముల నిది శ్రీనాధకృతముగా నాకు వినవచ్చెను. శ్రీ డి. పిచ్చయ్యశాస్త్రి గారు చాటుపద్యరత్నాకరమున శ్రీనాధకృతముగా జేర్చిరి. శ్రీ జం. తమ్మయ్యగారు పగటిభాగవతపువేనగాయ చెప్పినదిగా దాము వ్రాసిరి. సిమో!