పుట:2015.333901.Kridabhimanamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీనాధుని ఛాటుధారలు

వాడుక గలదు. శ్రీనాధుని గ్రంధముల్లో నీ పద్యమునుబోలు పద్యములు పెక్కులు 'క్ష ' ప్రాసముగలవి రచనా సామ్యముగలవి గలవు. శ్రీనాధు డవసానకాలపద్యమున "రంభ గూడే దెలుంగురాయరాహుత్తుందు కస్తూరి కే రాజుబ్రస్తుతింతు" నని చెప్పుకొనెను. ఇట్లీపద్యము శ్రీనాధకృతమే యగుట నిరూపితమగుచున్నది. ఈ పద్యమును బట్టి శ్రీనాధుని నర్తన మెట్టిదిగా దలపవలెనో తెలుపుటకు సహృదయులు ప్రమాణము. శృంగార శ్రీనాధములో నీ పద్యమును గూర్చి కొంత వివృతి వాసితిని. దానిపై గొన్ని యాక్షేపములు వెల్వడెను. నిసారములు నిరర్ధకములును నగునాయాక్షేపముల ననువదించి సమాధానము చెప్పుట కిప్పుడు పూనుకొనను.

   'హా జలజా ' క్షీ ' త్యాది పద్యమును రాజమహేంద్రవరమున శ్రీనాధుడు చెప్పినదాని నింతకుముం దుదాహరించితినిగదా!  మఱియు శాస్త్రార్ ధైకప్రవణు లగుతర్క విద్వాంసులు తన్నును దన విషయలౌల్యమును నుద్దేశించి యీసడింపగా శ్రీనాధుడు చెప్పినదని యీ క్రింది పద్యము సర్వాంధ్రదేశమునను వ్యాప్తి గన్నది--

శా. హంసీయానకు గామికి*న్నధంరోమాళుల్ నభ: పుష్పముల్
    సంసారద్రుమమూలపల్లవగుళుచ్చం బైనయచ్చోట వి


  • ఈ సంధి శ్రీనాధప్రయుక్తమే. శివరాత్రిమహాత్మ్యమున జూడదగును. 'కయ్యరమ ' అనియేని కవి ప్రయోగము గానవచ్చును.