పుట:2015.333901.Kridabhimanamu.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాజమహేంద్రవీధి గవిరాజు ననున్ గికురించి భర్గకం
ఠాజీరకాలకూటఘటికాచిత మైనయమానచీకటిన్.

       ఈ పద్యము శ్రీఎనాధుని చాటుధార యని *కవిలోకచింతామణిని, లక్షణ్భసారసంగ్రహమునను, బాలబోధచ్చందమునను, లక్షణదీపికను నుదాహృతమై కాంవ్వచ్చు చున్నది.
     మఱియు నీపద్యము మోదుకూరిలో బల్లెం కనకరాజుగారి యింటి తాళపత్రపుస్తకమున గూడ శ్రీనాధునిదిగా గలదు.  ఇన్నింటిలో నిట్లుదాహృత మయిన పయి పద్యమును శ్రీనాధేతరు లెవ్వరో సృష్టించిరనుటన్యాయ్యముగాదు.  అంతటియావశ్యకత యెప్పటికి నుండదు.  ఇతరులే సృష్టించి చేర్చిరని నిరూపింపగల బలవత్ప్రమాణములు చూపినచో జోహారులు ! పై చాటుధారలో 'రాజమహేంద్రవీధి '

  • కవిలోక చింతామణికర్త కాఠంభట్టు శ్రీనాధుని తర్వాత 100 ఏండ్లలోనివాడు. లక్షణసారసంగ్రహకర్త కూచిమంచి తిమ్మకవి. బాలబోధచ్చందస్సుకర్త పేరెఱుగరాదు. అందు బహుప్రాచీనము అయినగ్రంధము లుదాహృతము లయ్యెను. అప్పకవికంటె దత్కర్త ప్రాచీనుడు గాదగును. అది ప్రాచ్యలిఖితపుస్తకశాలలో గొంత గలదు. బ్రహ్మశ్రీ మా. రామకృష్ణకవిగారిదగ్గఱ గొంతగలదు. వారు దఱచుగా నక్కడక్కడ నుదాహరించుచు వచ్చిన ప్రాచీనపద్యరత్నము లనేకము లందలివి. రత్నజని యగునాగ్రంధమునుగూర్చి వేఱుగా నొక వ్యాసము వ్రాయదును. లక్షణదీపిక గూడ నప్పకవి దర్వాతిదిగాదు. అప్పకవి స్మరించిన లక్షణదీపిక యిదియేని కాదగును. ఆనందరంగరాట్చందస్సులో రఘునాదీయలక్షణదీపిక యని కలదు. మఱి కొన్నింట వార్తాకవి రఘునాధయ్యగారి లక్షణదీపిక యని కలదు. క్రీ. 1600 లో నీ రెండు గ్రంధములు నెంపి యుండవచ్చును.