పుట:2015.333901.Kridabhimanamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తోనే సూక్ష్మముగా నాతని స్త్రీలౌల్యమును సూచించితిని. దానిపై నొక్రు పెద్దగా నాక్షేపముల బ్రకటించిరి. శ్రీనాధుని స్త్రీలౌల్యప్రఖ్యాపకము అయిన చాటుధారేల నా గ్రంధమున బ్రకటింపనయితి గాదయ్యెను. అట్టి విధ్యముల నందు బ్రకటింపకుండుటయు బెద్ద యూఅక్షేపమేయయ్యెను. ఆ పద్యముల బ్రకటింపకున్నచో వారి యాక్షేపములకు జాలినంత సమాధానము ఘటిల్లదు గావునను, బాహాటముగా వాని బ్రకటింపదగదు గావునను విప్పటివఱకు నే నా యాక్షేపముల కేమియు సమాధానము చెప్పనయితిని. పండితులు, కావ్యతత్త్వ పరిశోధకులు, ప్రౌడులు నగువారికే పడయదగినది గాన యందాపద్యములు బొందించుచున్నాడను. నా గ్రంధముపై వెల్లివిరిసినయాక్షేపముల వెల్లువ కిక వేఱొక చోట జల్లగా సమాధానములు సాగింప గల్గుదును.

క. *బూతుంబద్దెము లికపై
    జేతులు పడకాడ మనసు చీదఱపదగా
   తోత జనింపగ గూర్చెర
   నీతిపరుల్ లో జరుపుడు విర్లిప్తులుగాన్.
                            
                            శ్రీనాధుని చాటుధారలు
ఉ.హాజలజాక్షి ! హాకివలయాధర ! హాహరిమధ్య ! హాశర
   ద్రాజనిభావ్య ! హాసురతతంత్రకళావిధి ! యొందు వోయితే


  • ఈపద్యము శ్రీశాస్త్రిగారు రచించిరి.