పుట:2015.333901.Kridabhimanamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాహ్మణుడు భ్రష్టుడై చండాలకన్యతో సంగమించుటను జెప్పుసందర్బమున నీయశ్లీలము గొంత యౌచితి గలదేయగునని తలచి నిరంకుశుడై శ్రీనాధు డిట్టిరచన జేర్చెను. క్రీడాభిరామమందలిరచనలు నిట్తివే. అంధ్రకవులలో శ్రీనాధునకు బూర్వ మిట్టిరచనలను జేసినవారు గానరారు.

నన్నిచోడడు మాత్రము:
క.స్మరమందిరమ్ము శోబా
   కరముగ మెఱుగారుపసిడికంబము లనగా
   గరమెప్పు నగతనూజకు
   గరభోరులు వొలుచు మదనకరికరలీలన్
                                    (కుమార సం. 3-48)
గీ. అదిమి పట్టిన గరులైన జదియునట్టి
    కడిదిబలు లగుమగ లొత్తి గౌగిలింప
    గురుమకోమలు లగుసతుల్ గొనరుచునికి
    గనియు నెఱుగవె విపరీతకామశక్తి. (కుమార సం. 4-79)
        అని యించుక హద్దుదాటి కుమారసంభవమున
రెండుపద్దెముల జెప్పెను.
                              శ్రీనాధుని శీలము

 సత్ప్రబంధములందు గూడ నిట్టిరదనలను సంకోచింపక నిరంకుశముగా జొప్పించుటకు శ్రీనాధునిశీలమెట్టిదై యుండదగునో యించుక యోజించిన గోచ