పుట:2015.333901.Kridabhimanamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

                                                       శ్రీనాధు డిట్టి రచన చేయునా?
సీ.శితికంఠునకును నెచ్చెలికాదు గాడొకో
      యటమటీ డైనయీయక్షభర్త.
    ఇత్యాది సీసపద్యముగీతితిలో
ఏమి గుడువంగ వచ్చినా రెండ్లు విడిచి
హారునివెలివెట్టినట్టి యీయాగమునకు
బంచవరమను కను జెపురించె నేని
తర్ క్షణమునంద తమయాండ్రత్రాళ్ళు దెగవె.(కాశీ.7-60)

    ఇందు  శ్రీనాధుని కనవనంపుబెంపు, నిరంకుశత, భవోద్రేకముదైవాఱుచున్నవి. *(వీరభద్రుడు)కుబేరుని, అగ్నిని చంద్రుని, ఇంద్రునితిట్టుచున్నాడు.  'ఏమి గుడువంగ వచ్చినా ' రనుటలో భుజించుట యను నుచితార్ధ మున్నను వేఱొకయశ్లీలార్ధమును వ్యక్తమగుచునే యున్నది.  'ఈ యాగమునకు ' అనుచో 'నీ ఆగమునకు ' అనికూడ ఛేదమున్నది.  'అల్లరీఆగమూ ' అని నానుడి.  'తమ యాండ్ర త్రాళ్ళు తెగవె ' ఇట్టి పలుకుములుకులు సాధారణ కవుల రచనలలో సాగునవి గావు.  ఈ పధ్యము చదివినప్పుడెల్ల శ్రీనాధుడు గవిసార్వభౌముడై నాకు గన్పట్టుచుండును.  'కుడుచు ' ధాతువును భుజించు నర్ధమున నీతడు ప్రయోగించుట జూపి యిక్కడ నన్నెవ్వరే నాక్షేపిందుతు గాబోలును.  'ఏమి గుడువంగ వచ్చినా ' రనుటలో రెండవయర్ధ

  • ఇందున్నట్లు వీరభద్రుడుకాదు. 'దధీచి ' అని చదువుకొనవలెను. (ప్రకాశకుడు)