పుట:2015.333901.Kridabhimanamu.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ. ఆని శంభుండు నిఖిలబ్రహ్మాండ సంభార కుక్షింభరి
యగు నిజమహాలింగ స్తంభంబు స్తంబింపం జేసెనప్పుడుముకుళీత
హస్తారవిందులై దేఫదారు వన దివ్యాశ్రమమస్థులగు.......బులు
జనియుఇంచి........సాహిత్యభూషనుని బహువిధంబుల భక్తివిశేషం
బుల భజియించిరి. భోగమోక్షంబులు గాంచిరి....... వనవిహా
రంబు.....ఫలసిద్ధ యగును"

మఱియును:
శా. కాంచీకంకణతారహారకటకగ్రైవేయభూషావళుల్
   లంచం బిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూడన్ననిన్
  బంచాస్త్రోపము దారతారకవయన్ బ్రార్ధించి లోలోపలన్
  బించారామములందు బెల్వెలపురిన్ బ్రౌడేందుబింబాననల్
                                         (భీమ. 1-77)
మఱియును:
సీ. ముడువంగనేర్తురు మూల చాపటికి రా
            నికురబంధము లెగ జీరువాఱ
  జొన్నపువ్వుల బోలుపొక్కిళ్ళుబయలుగా
       గట్టునేర్తురు నీర గటిభరమున
  దొడువంగ నేర్తురు నిడువ్రేలుజెవులందు
      నవతంస్కంబుగా నల్లి పువ్వు
  పచరింప నేర్తురు పదియాఱువన్నియ
      పసిడిపాదంబుల బట్టుచేల
  వయ్యెదయు నిగ్గు (సిగ్గు) బాలిండ్ల బ్రాక్జ నీరు
  తఱచు పూయుచు రోలగందంబు పనుపు.