పుట:2015.333901.Kridabhimanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్నుద్రింపకే విడిచిరి. నెటికి నాబాగ మట్లే కలదు. పలువురు విద్వాంసు లాశ్రీనాధరచనము పరిహృతమయినందుకు దురపిల్లుచున్నారు. ఎందఱెందరో విద్వాంసులాభాగమెట్లెండునో యెందేని దొరకునోయనికూడ నన్నడిగిరి. బాహాటముగా దాని నాగ్రంధమున ముద్రించుట భావ్యము గాదు. శ్రీనాధుని నిరంకుశత్వనిరూపణమునకై దానినిక్కడ జూపుచున్నాడను.

హరవిలాసము 5-57 పద్యము తర్వాత:
"ఇట్లు పరమధూర్తనంబునం బ్రవర్తిల్లు నయ్యష్ట
మూర్తి యిష్టావూర్త ధర్మకర్మాఢ్యు లగునమ్మఠపతులు.....
రెన కట్తిన కౌపీనంబు దలంగవైచి ప్రాచీనబర్హికుంభిశుండాదండ
సన్నిభం బైనమదనధ్వజదండంబు నిగుడించి యమ్మహనీయ సాధ
నంబున నమ్మహీసురోత్తముల యుత్తమాంగంబు.........
... దకడత లడంచియు జెవులకొడంక లొత్తియు మొగంబులు
మెత్తియు ముక్కులునొక్కియు బరులువేసియు వీపులుచఱ
చియు బండ్లు రాల్చియు మరంబులు ఱాచియు.... .. త్రికం
బులు దాకించియు జంఘలు వొడిచియు జానువులు తాటిం
చియు బడలువఱచియు దోలి తొప్పఱంబెట్టి యార్చి యమ్మహా
లింగంబు నింగి దాకం బెరిగించుటయు నక్షత్రమండలం(లను)
ముత్యాలగొడుగునకుం జపిండికామభంగి నంగీకరింపజేసి
సోమార్కమయమహాసోపానంబుల డిగ్గు వియద్గంగాప్రవాహంబు
నభిషేకం బాపాదించి బ్రహ్మాండకర్పరం బప్పళింపజేసి నాగ
..........