పుట:2015.333901.Kridabhimanamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్ర్తీనాధు డిట్టి రచన చేవ్యునా/

లోని వనదగినవి కొన్ని సంక్కృత శ్లోకములు నాకు గానవచ్చినవి. క్రీడాభిరామపద్యములకు మూలప్రాయములుగా నవి గలవు. ప్రేమాభిరామము ననుసరించి రచించిన దగుటచే గ్రీడాభిరామమునగూడ నట్టిరచనలు చేరి యుండవచ్చును. ఔచితి నెఱిగిన శ్రీనాధమహాకవి వాని నడచి పుచ్చక తెలిగించునాయని యాక్షేపించువారీ క్రిందివిషయమును గూ'డ నారయ దగుదురు. ఆచార్య దండిప్రభృతులు గ్రామ్యతాదోషము క్రింద గణించి గర్హించినరచనములు శ్రీనాధుని సర్వగ్రంధములందును గలవు. శ్రీనాధుడాచార్య దండి ప్రభృతుల యనుశాసనము నెఱుగనివాడు గాడు. నిరంకుశుడై స్వతంత్రుడై యాత డట్టిరనమ్ల జేర్చినాడు. 'ఔచిత్యముని బోషించియు ననౌచిత్యమును బరిహరించియు రచించితి ' నని శ్రీనాధుడే చెప్పుకొన్న శృంగారనైషధము సప్తమాశ్వాసమున నూటముప్పడి మూడవపద్యము 'యజమానప్రమదావికస్వ ' రేత్యాది కము జగుప్సావహము, గ్రామ్యతా దోషజుష్టము. మూలమున నుండునే కాక ! మఱియు "విధజ్జనులు నిన్ను విషయించి వత్తురు" (నైష. 6-110) ఇత్యదిపద్య మశ్లీలముగాదా ? అనౌచితిని బరిహరించుటలో నది చేరవలదా ! ఇక హరవిలాసము. దీనిని దొలుత ముద్రించిన సరస్వతీ పత్రికాధిపతు లనౌచిత్యభీతిచే గొంత గ్రంధభాగమును





1