పుట:2015.333901.Kridabhimanamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నము లసభ్యములై యున్నవి. మహాకవి యగు శ్రీనాధుడిట్టి రచనములు జేయబూనుననుట సంగత మగునా యని స్ందేహముతోచును. ఇంచుక విపులముగా విమర్శించినచో నీసందేహమునకు స్థానముండదు. సంస్కృతభాషలో భాణములు, ప్రహసనములు, వీదులు కావ్యనాటకాదుల కంటె గొంత హెచ్చుగా వచ్చినా గాముకీకాముక వ్యాపారవర్ణనములతో వెలయుచున్న నన్నవిషయము స్ంస్కృతభాషాపాండిత్యము గల సరసులకు జక్కగా నెఱుక కెక్కియుండునదే. బహుప్రాచీనులగు శూద్రకవరరుచీశ్వరదత్తశ్యామిలకారులును, శ్రీనాధుని సమకాలమువారగు డిండిమభట్ట బాణాదులును రచించిన భాణములందు బచ్చిపచ్చిగా వర్ణనలు హెచ్చుగా గానవచ్చును. మచ్చునకు గొన్నిపద్యము లిచ్చుచున్నాడను.

  • స్రగ్దర.


అక్షిప్తప్రస్తవస్త్రాం ప్రశ్ధిలరళనాం ముక్తనీవీం నిహస్తాం
హస్తవత్యానగుప్తనవివరనలీమధ్య నాభిప్రదేశాం
లజ్జాదీనోపవిష్టాం వహి నహివినృజేత్యేనమోశ్రద్ధమాబాం
శయ్యామారోవ్య కాంతాం మరతసమరయప్యాగ్ర నవ్యంగృహాణ
(శూద్రకుని పద్మపాకృతకము. పుట 11)

______________________________________________________

  • చూ. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు, యస్. కె. రామనాధశాస్త్రిగారు పరిష్కరించిన ‘చతుర్భాణి ‘ — 1922లో బ్రకటితము.